తేది: 12-06-2026
ఈ రోజు సమగ్ర జిల్లా అధికారుల సముదాయ భవనంలోని మినీ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి యూ-విన్ (U-WIN) పోర్టల్‌పై శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. కె. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా యూ-విన్ పోర్టల్‌లో గర్భిణీ స్త్రీల నమోదు, అలాగే నవజాత శిశువులకు అందించే టీకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. యూ-విన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ విధానం మరియు ఇతర సాంకేతిక అంశాలపై ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించబడింది.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని డా. బి. కిరణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారి, మరియు అఖిల, వి.సి.సి.ఎం.లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డా. బి. శ్రీరాములు మరియు జిల్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు.
TELANGANA PEDDAPALLI
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, పెద్దపల్లి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **