Banner
Watermark
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, పెద్దపల్లి
📅 12 June 2026, 05:03 PM ✍️ admin
News Image
తేది: 12-06-2026
ఈ రోజు సమగ్ర జిల్లా అధికారుల సముదాయ భవనంలోని మినీ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి యూ-విన్ (U-WIN) పోర్టల్‌పై శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. కె. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా యూ-విన్ పోర్టల్‌లో గర్భిణీ స్త్రీల నమోదు, అలాగే నవజాత శిశువులకు అందించే టీకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. యూ-విన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ విధానం మరియు ఇతర సాంకేతిక అంశాలపై ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించబడింది.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని డా. బి. కిరణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారి, మరియు అఖిల, వి.సి.సి.ఎం.లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డా. బి. శ్రీరాములు మరియు జిల్లాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home