తేదీ: 12-06-26
జనగామ2026-2027 సంవత్సరమునకు గాను జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థిని/విద్యార్థులు 1వ తరగతికి(15), 5వ తరగతి(37)లలో మిగిలిన సీట్ల కొరకు, బెస్ట్ అవైలబుల్ పథకం క్రింద ప్రవేశముల దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపినారు.
➤ దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంభ తేది: 15.06.2026.
➤ దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేది: 22.06.2026.
జిల్లాలో గల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్
1. సెయింట్ థామస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం శివునిపల్లి (స్టేషన్ ఘనపూర్) (డే స్కాలర్, రెసిడెన్షియల్)
2. సిద్ధార్థ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాలకుర్తి (డే స్కాలర్)
3. జాన్ బ్రిటో హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం కడవెండి (డే స్కాలర్, రెసిడెన్షియల్)
4. సెయింట్ పీటర్ ఫౌండేషన్ హైస్కూల్ ఇంగ్లీష్ మీడియం నిడిగొండ (డే స్కాలర్, రెసిడెన్షియల్)
అర్హతలు:
1. ఒక కుటుంబములో ఒక విద్యార్థిని/విద్యార్థి మాత్రమే ఈ పథకము క్రింద అర్హులు.
2. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.1,50,000/- లు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2,00,000/- లకు మించరాదు.
దరఖాస్తుతో జత చేయవలసిన ధృవపత్రములు
1. పుట్టిన తేది ధృవీకరణ పత్రము (మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపల్ బోర్డు/ మీ-సేవా ద్వారా జారీ చేయబడినది)
➤ 1వ తరగతికి విద్యార్థులు తేది: 01.06.2020 నుండి 31.05.2021 మధ్య జన్మించి ఉండవలెను
➤ 5వ తరగతికి విద్యార్థులు తేది: 01.06.2016 నుండి 31.05.2017 మధ్య జన్మించి ఉండవలెను
2. రేషన్ కార్డ్ / ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ.
3. మీ-సేవా ద్వారా జారీ చేయబడిన కుల, ఆదాయ మరియు నివాస ధృవీకరణ పత్రము.
4. (3) పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోలు.
5. పాఠశాల నుండి గత సంవత్సర మార్కుల జాబితా జిరాక్స్ కాపీ.
ఆసక్తి గల విద్యార్థిని/విద్యార్థుల జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ జనగామ జిల్లా గారి కార్యాలయము నుండి దరఖాస్తు ఫారం పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్ – యఫ్ 25 కలెక్టరేట్ జనగామ జిల్లా, తేది: 22.06.2026 సాయంత్రం 4 గం.ల లోపు సమర్పించగలరు.
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి,
జనగామ జిల్లా.