రాజన్న సిరిసిల్ల జిల్లా (నేటి ప్రభాత దర్శిని) ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం మంచినీటి శుద్ధి యంత్రాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గతంలో మాజీ ఎంపీ ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వాటర్ ఫిల్టర్ ని ఇవ్వగా అది చెడిపోవడంతో రెండు లక్షల రూపాయలతో కొత్తగా వాటర్ ఫిల్టర్ తో పాటు కూల్ బబుల్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు మూడు సంవత్సరాల పాటు ఈ వాటర్ ఫిల్టర్ ను లీజుకి ఇవ్వడం జరిగిందని తక్కువ ధరకే గ్రామ ప్రజలకు అందించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని గ్రామపంచాయతీ పాలకవర్గం సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతే మధుసూదన్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్. వార్డు సభ్యులు సాయి కృష్ణ ఎస్కే సమాద్. అనరాసి నరసింహులు జెల్ల రవి. అంబటి పద్మ నాయకులు సిరిపురం మహేందర్ దొమ్మాటి రాజు తదితరులు పాల్గొన్నారు
TELANGANA JANGOAN
మంచినీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **