జూన్ 10
జనగాం
ప్రజల భాగస్వామ్యం తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా... బచ్చన్న పేట మండలం రామ చంద్రపురం లోని రైతు వేదిక లో నిర్వహించిన గ్రామ సభ కి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిది గా హాజరయ్యారు
ఈ సందర్బంగా కలెక్టర్ ఘన వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా చేపట్టల్సిన కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని.. బహిరంగ ప్రదేశాల్లో అస్సలు చెత్త వేయకూడదని, తగుల బెట్టకూడదన్నారు
పర్యావరణ పరిరక్షణ లో భాగం గా చెత్త విభజన, పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలకి అధికారులు అవగాహన కల్పించాలన్నారు
వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని...పైపులైన్లకు మరమ్మత్తులు, నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు.
వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు
ఫీవర్ సర్వే చేయాలనీ జ్వరం తో బాధ పడే వారిని గుర్తించి తగు వైద్యం అందించాలని,దోమలు వ్యాప్తి చెందకుండా
ఎప్పటికప్పుడు స్ప్రే చేయాలనీ కలెక్టర్ సూచించారు
గ్రామాల్లో ఇసుక, నీటి తదితర సమస్య లు ఎదురైతే
టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6605
కి ఫోన్ చేసి సమస్య లను అధికారుల దృష్టి కి తీసుకరావాలన్నారు
గ్రామానికి చెందిన
బాలమణి అనే మహిళ తన భర్త సంవత్సరం క్రితం
చనిపోయారని...తనకు పెన్షన్ ని మంజూరు చేయాలనీ తెలపగా... ముందు
NFBS పథకం లో భాగం గా... వారం లోపల ఆర్ధిక సహాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కి సూచించారు
యుద్ధ ప్రాతిపదికన మండలం లో... NFBS పథకం ద్వారా అర్హులైన వారికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ త్వరగా జారీ చేసి ...ఆర్ధిక సహాయం అందించాలన్నారు
ప్రతీ 15 రోజులకోసారి గ్రామ సభ ను నిర్వహించుకొని.. గ్రామ ప్రజల సమస్య లకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు పని చేయాలన్నారు
అనంతరం...రామ చంద్రపురం మండల పరిషత్ ప్రైమరి స్కూల్ లో చేపెట్టిన
అదనపు తరగతి గదుల నిర్మాణన్ని కలెక్టర్ పరిశీలించి...
టెండర్ ప్రక్రియ ని త్వరగా చేసి...మూడు, నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలనీ, జడ్పీ సీఈఓ కి తెలిపారు
విద్యార్థుల నమోదు ను పెంచాలని..కావలిసిన మౌలిక సౌకర్యాలను తప్పకుండ సమకూరస్తామన్నారు
ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ రంగారావు, ఎంపీడీఓ, సర్పంచ్ వినోద్,ఉప సర్పంచ్
వ్యవసాయ, వైద్య,ఆరోగ్య తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు