నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి. కామారెడ్డి. కరుణాకర్.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహించే త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం కలెక్టరేట్ సమీపం లోని ఈవీఎం (EVM) గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ,యంత్రాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాం తాళాల భద్రత, సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా సిబ్బంది విధులు, రిజిస్టర్ తదితర అంశాలను తనిఖీ చేశారు.
గోదాంలో భద్రపరిచిన యంత్రాల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, గోదాం ఇన్‌ఛార్జ్‌లు, భద్రతా సిబ్బంది పాల్గొన్నార్