Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • జనగామ జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు

    Reporter
    admin June 9, 2026, 12:52 pm

    జూన్ 09
    జనగామ
    జనగామ జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్లకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు, 132/33 కేవీ సబ్‌ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో అంగరంగవైభవంగా నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ కుసు పాషా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్‌ రెడ్డి, పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవురి ప్రకాష్‌ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు, భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మామిడాల యశస్వినీ రెడ్డి, కుడా చైర్మన్, డిసిసి అధ్యక్షులు, హనుమకొండ జిల్లా ఇనుగాల వెంకట్రాం రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు, జనగామ జిల్లా లకావత్ ధన్వంతి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా కలెక్టర్, హనుమకొండ చాహత్ బాచ్ పాయ్, సియండి ట్రాన్స్‌కో డి. కృష్ణ భాస్కర్, సియండి టీజీఎన్‌పిడిసిఎల్, వరంగల్ కర్నాటి వరుణ్‌ రెడ్డి, కమీషనర్ ఆఫ్ పోలీసు, వరంగల్ సన్ ప్రీత్‌ సింగ్, డిసిపి జనగామ బి.రాజ మహేంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ, జనగామ, ఛైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ (స్టేషన్) మునిసిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఘన్పూర్ (స్టేషన్), ఛైర్మన్ లావణ్య శిరీష్‌ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థానం, ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌ రావు, పల్లగుట్ట గ్రామం, సర్పంచి, ఎనగందుల నర్సింహా రెడ్డి, సాగరం సర్పంచి, మమత చేతన్, కొండాపూర్ సర్పంచి, గుగులోత్ దేవేందర్, కుర్చపల్లి సర్పంచి, బైకాని రాజు, నష్కల్ సర్పంచి రాజుతో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

    ముందుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

    అనంతరం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన విద్యుత్ సబ్‌ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.

    ఈ సందర్భంగా మొత్తం (60,838) మంది వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

    ఇందులో భాగంగా 132/33 కేవీ పీచర సబ్‌ స్టేషన్ – రూ. 43.92 కోట్లు, వేలేరు మండలంలోని పీచరలో 2x10/16 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మించిన 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ను, 33/11 కేవీ కొండాపూర్ సబ్‌ స్టేషన్ – రూ.2.50 కోట్లు, 33/11 కేవీ సాగరం సబ్‌ స్టేషన్ – రూ.2.29 కోట్లు, 33/11 కేవీ కుర్చపల్లి సబ్‌ స్టేషన్ – రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.

    అలాగే చిల్పూర్ మండల పరిధిలో రూ. 9.66 కోట్ల వ్యయంతో మూడు నూతన 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి, పల్లగుట్ట 33/11 కేవీ సబ్‌ స్టేషన్ – రూ. 3.25 కోట్లు, లింగంపల్లి 33/11 కేవీ సబ్‌ స్టేషన్ – రూ. 2.81 కోట్లు, నష్కల్ 33/11 కేవీ సబ్‌ స్టేషన్ – రూ. 3.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

    తదనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించిన రైతు సేవా కేంద్రం స్టాల్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

    అనంతరం సభా వేదికపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ఆరంభించారు.

    అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login