జూన్ 8
జనగాం ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో... సభ స్థలం వద్ద చేయాల్సిన ఏర్పాట్లను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పరిశీలించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 60.62కోట్ల విలువైన 7 విద్యుత్ సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్బంగా.. చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్చించారు.
ఈ సందర్బంగా.. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సుమారు 6వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
స్టేజ్ పైన, సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.... 60.62కోట్ల విలువైన సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి మొట్ట మొదటి సారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి వస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలకనున్నట్లు తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలం పీచరలో 132/33 కేవి సబ్ స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్ గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరియు చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమర్క శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్బంగా నియోజకవర్గ పరిధిలోని 7మండలాలలో ఇళ్లపై నుండి వెళ్తున్న 33/11కేవి, సర్వీస్ లైన్ల షిఫ్టింగ్ సమబందించిన సమస్యలను, అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలోని 132/33 కేవి సబ్ స్టేషన్ ను 220/132కేవి సబ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి ని కోరనున్నట్లు వేల్లడించారు.
ఈ సబ్ స్టేషన్ల ఏర్పాటుతో నియోజకవర్గ పరిధిలో దాదాపు 90శాతం విద్యుత్ సమస్యలకు పరిష్కారం అయినట్లే నని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా ప్రధాన ఉదేశ్యం అని తెలిపారు.
ఒకే రోజు ఒకే చోట 7సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరుగుతున్న సందర్బంగా నియోజకవర్గ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డివో, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు