జూన్ 04
జనగామ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాగురువారం, జిల్లాలోని నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియ, ట్రక్ షీట్ నిర్వహణ, రిజిస్టర్ల నమోదును పర్యవేక్షించారు.
కొనుగోలు కేంద్రంలో లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ట్రక్ షీట్, సంబంధిత రికార్డులు తప్పనిసరిగా సక్రమంగా నిర్వహించాలన్నారు.
లోడింగ్ పనులను నాలుగు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పనుల సమర్థవంతమైన నిర్వహణ కోసం హమాలీలను మూడు బ్యాచ్‌లుగా విభజించి పని చేయాలని సూచించారు.
అదే విధంగా అదనపు ట్రాక్టర్లను వినియోగిస్తూ, ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.