రాజన్న సిరిసిల్ల, జూన్ 2
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జాతీయ జెండాను మంగళవారం ఆవిష్కరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఏవో రాంరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.