రాజన్న సిరిసిల్ల, జూన్ -02
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా సిరిసిల్లలోని పాత బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా సందేశాన్ని వినిపించారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
స్టాళ్ల పరిశీలన
అటవీ శాఖ, డీఆర్డీఓ, పోలీస్ శాఖ, పౌర సంబంధాల శాఖల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పర్యావరణ ఉత్సవాల కింద అటవీ శాఖ ఆద్వర్యంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అధికారులు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య,
వేములవాడ ఆర్డీవో కే ఎస్ బీ కుమారి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పి నాగేంద్రాచారి, సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.