జూన్ -01
జనగామ.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణి కార్యక్రమoలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్
ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, వారి ఆర్జీలపై ఎండార్స్మెంట్ చేసి సంబంధిత శాఖల అధికారులకు తెలియజేస్తూ సత్వరమే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నేటి ప్రజావాణిలో 495 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.
ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి
చిల్పూర్ మండలo , పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన చిలుక యాదగిరి, తండ్రి కొండయ్య.. ఊరు శివారులో 302 సర్వే నెంబర్ లో గల తన భూమికి... పట్టాదార్ పాస్ పుస్తకం ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తును సమర్పించారు.
జనగామ మండలం, వడ్లకొండ 7వ, వార్డుకు చెందిన శివర్ల రాజమ్మ, నిరుపేదను అయినందన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయగలరని వినతి సమర్పించాడు
లింగాల గణపురం మండలం, కళ్లెం గ్రామనివాసి అయిన జల్లెల్ల మల్లారెడ్డి తండ్రి నర్సిరెడ్డి .. ఆర్థికంగా తాను వెనుకబడి ఉన్నానని, అలాగే తనకు 69 సంవత్సరాలు ఉన్నందున... వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయగలరని కోరాడు
జనగామ మండలం , ధర్మ కంచ వాస్తవ్యురాలు పుట్నాల కమల... తన ఎడమ కాలుకు అంగవైకల్యం కలదని...PHC సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని, అనేకసార్లు సదరన్ క్యాంపుకు హాజరు అవుతున్నానని, అయినా ఫలితం లేదని, కావున నాకు సదరన్ సర్టిఫికెట్ ఇప్పించి, దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయగలరని దరఖాస్తు చేసుకున్నారు.
జనగామ మండలం, చౌడవరం గ్రామ నివాసి..మునిగే కవిత తనకు రేషన్ కార్డు లేకపోవడం వలన ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేయలేదని , నాకు నివసించుటకు సొంత ఇల్లు లేదని, కావున ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా క్రింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని విన్నవిస్తూ వినతి పత్రం అందజేశారు.
ఈ ప్రజావాణిలో జెడ్పీ సీఈవో రంగా రావు, పిడి హౌసింగ్ మాత్రునాయక్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవికిరణ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.