పెద్దపల్లి, జూన్ 01: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన
జి. లక్ష్మీ తాను నాగారం లో కిరాయికి వింటూ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నానని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి మండలం అప్పన్న పేట గ్రామానికి చెందిన పద్మ ప్రస్తుతం తనకు రేషన్ దుకాణం ద్వారా సాధారణ కోట మాత్రమే లభిస్తుందని ఒంటరి మహిళలకు ప్రభుత్వం నిబంధనలు ప్రకారం నెలకు 35 కిలోల బియ్యం కార్డు కింద మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ పెద్దపల్లి కు రాస్తూ విచారణ జరిపి అంత్యోదయ కార్డు అర్హత మేరకు మంజూరు చేయాలని అన్నారు.
సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లె గ్రామానికి చెందిన గంధం రాములు గ్రామంలోని హౌస్ నెంబర్ 5-54, లో నివాస గృహంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడను అక్రమంగా కూల్చేసారని దీనివల్ల 3,50,000 నష్టం జరిగిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది