తేది-01-06-2026. ఈ రోజున ' ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ' పురస్కరించుకొని, పొగాకు ఉత్పత్తులు వినియోగము మరియు పొగ పీల్చడం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన ర్యాలీ ని జిల్లా ఆసుపత్రి ఆవరణనుండి తెలంగాణతల్లి విగ్రహము చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులు వినియోగము మరియు పొగ పీల్చడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధించిన మరియు ఊపిర్తితుల వ్యాధులు వస్తాయి.ఇది ఒక ప్రధాన ప్రమాద కారకంగా ఉందని విన్నవించడమైనది.
పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి మరియు పొగాకు నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, ప్రతి సంవత్సరం మే 31వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు అని అన్నారు .ప్రపంచ ఆరోగ్య సంస్థ 2026 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క ఇతివృత్తం " ఆకర్షణను బహిర్గతం చేయడం: నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం." అని అన్నారు.
COTPA (కోప్ట ) చట్టం, 2003 కింద అమలు చర్యలో భాగముగా, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు మొదలగు ప్రదేశాల్లో పొగ తాగితే 200/- నుండి 10000/- వరకు జరిమానా వేయబడును.కావున యువత పొగకు వినియోగానికి మరియు పీల్చడానికి దూరంగా ఉండాలని చెప్పినారు.ఈ కార్యక్రమంలో డా రాజమౌళి, ప్రోగ్రాం అధికారి ఎన్ సి డి, రాజగోపాల్ ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు, వి. శ్రీనివాస్, ఐ ఆర్ సి ఎస్ కార్య వర్గ సభ్యులు , డా. శ్రవణ్, డా .రామకృష్ణా, డా.స్పూర్తి, డా.సౌమ్య వైద్యాధికారులు, టి. రాజేశ్,మధుసూదన్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లు మరియు ఆరోగ్య కార్య కర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
పెద్దపల్లి