• Other News
  • Live TV
  • మహిళలకు సురక్షితమైన వాతావారణం ఉండడమే ప్రధాన లక్ష్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin May 27, 2026, 1:29 pm
      మహిళలకు సురక్షితమైన వాతావారణం ఉండడమే ప్రధాన లక్ష్యం    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమాల నేపథ్యంలో...నిర్వహిస్తున్న మహిళా భద్రత, రక్షణ వారోత్సవాలలో భాగంగా...బుధవారం లైంగిక, వేధింపుల నిరోధక చట్టం 2013 మీద కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో... మహిళా ఉద్యోగులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, అదనపు కలెక్టర్, DWO బెన్ షాలోం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..

    ముందుగా.. ఈ చట్టం లో ఉన్న ప్రతీ అంశాన్ని,ఇంటర్నల్ కమిటీ అవశ్యకత ను స్వయం గా కలెక్టర్ సవివరంగా వివరించారు

    అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...
    పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 అనేది మహిళలకు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కలిగించటానికి ఏర్పడ్డ చట్టమని.... దీనిపైన మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు

    ప్రతీ కార్యాలయం లో
    స్త్రీలకు భయరహితమైన, సమానమైన, గౌరవప్రదమైన పని వాతావరణం ఉండాలన్నారు

    ప్రతీ ఆఫీస్ లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని... లైంగిక వేధింపులు ఎదుర్కునే బాధితులు మౌనం గా ఉండకూడదని... ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

    ఒకవేళ సంస్థలో అంతర్గత కమిటీ లేకపోతే లేదా ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాల్సి వస్తే, భారత ప్రభుత్వం SHE-Box పోర్టల్ (లైంగిక వేధింపుల ఎలక్ట్రానిక్ బాక్స్) ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కల్పించిందన్నారు .

    మన జిల్లా కి సంబందించిన కమిటీ లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరిగిందన్నారు

    సకాలంలో బాధిత మహిళ తన ఫిర్యాదు ను ఇవ్వాలని...నిష్పక్షపాతంగా, గోప్యంగా విచారణ జరుగుతుందన్నారు

    మహిళలపై జరిగే లైంగిక వేధింపుల చర్యలను నివారించడం, నిషేధించడం, పరిష్కరించడం ద్వారా కార్యాలయాలను మహిళలకు సురక్షితంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ చట్టం మహిళలకు ఒక మంచి అవకాశమన్నారు

    పని ప్రదేశాల్లో మహిళ లు ప్రశాంతం గా తమ విధులు ను నిర్వర్తించి నప్పుడే... కుటుంబ బాధ్యతలలో పూర్తి స్థాయిలో నిమగ్నమవుతారన్నారు


    మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ... సమాజ అభివృద్ధి కి,మహిళల భద్రత,గౌరవం, స్వేచ్ఛ చాలా కీలకమని తెలిపారు

    మహిళలు భయభ్రాంతులు లేకుండా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు

    మహిళను గౌరవించడం మన సంస్కృతి, మహిళలు సురక్షితంగా ఉంటేనే కుటుంబం సురక్షితంగా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు

    అందుకే ప్రతి ఒక్కరు..మహిళల పట్ల గౌరవభావంతో ప్రవర్తించి వేధింపులను అరికట్టేందుకు ముందుకు రావాలన్నారు

    అదనపు కలెక్టర్, DWO బెన్ షా లోం మాట్లాడుతూ....
    ఇప్పటివరకు కలెక్టరెట్ లో 35 కమిటీ లు,మండల కార్యాలయం లో 54 కమిటీ లు ఉన్నాయని.. కొందరు మహిళా ఉద్యోగులు బదిలీ లు అవ్వడం వల్ల అవి అప్డేట్ గా లేవని... ప్రజా పాలన కార్యక్రమం లో భాగం గా ఆ కమిటీ లను వివిధ శాఖల అధికారులు అప్డేట్ చేసుకోవాలన్నారు


    ఈ సమావేశం లో వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login