• Other News
  • Live TV
  • రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.....రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య

    Reporter
    admin May 27, 2026, 12:33 pm
    రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.....రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య

    పెద్దపల్లి, మే -27 : జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

    రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.

    రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల వేదిక , కూర్చోవడానికి ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, ఆర్ &బీ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.

    వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని ఆర్డిఓ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు.

    పెద్దపల్లి పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా మే 29 సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు.
    ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు.

    ఈ సమావేశంలో ఏ సి పి.జి. కృష్ణ ,కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ , సి విభాగం సూపరింటెండెంట్ కుమారస్వామి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తాసిల్దార్ రాజయ్య, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    ------------------------------------------------------------------------------------------------------------------------------
    జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login