మే 27
జనగామ ధాన్యం బస్తాల లోడింగ్ ను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
బుధవారం, జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని వెల్ది, జఫర్ గూడెం గ్రామాల పరిధిలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో కొనుగోళ్ల నిర్వహణ తీరు, ధాన్యం రవాణా, నమోదు ప్రక్రియలు, కాంటా వివరాలను కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కల్లాల్లో ఇంకా ఎంత ధాన్యం ఉంది? ఎంత ధాన్యం కాంటా చేయాలి? అనే విషయాలను తెలుసుకొని, రిజిస్టర్‌లు, ట్రక్ షీట్లను తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని లారీలు కేంద్రానికి చేరుకున్నాయి? ఎన్ని అన్‌లోడింగ్ పూర్తయ్యాయి? ప్రస్తుతం మిల్లులో ఎన్ని లారీలు ఉన్నాయనే? వివరాల గురించి ఆరా తీశారు.
ధాన్యం నిల్వలు ఆలస్యం కాకుండా అత్యంత ప్రాధాన్యతతో అన్‌లోడింగ్, రవాణా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
హమాలీల సంఖ్య, అందుబాటులో ఉన్న హమాలీలు ఎంత మంది? అనే వివరాలు తెలుసుకొని, అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా రెండు లారీల ద్వారా తక్షణమే లోడింగ్ చేయాలని తహసీల్దార్ కు సూచించారు.
ఓపీఎంఎస్ నమోదు ఎన్ని పూర్తయ్యాయో? పర్యవేక్షించి, రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలని తెలిపారు.
ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా వేగవంతంగా లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతమైన కొనుగోళ్లు, రవాణా, చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, రైతుల వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదుల కోసం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6605 లో సంప్రదించాలని రైతులకు సూచించారు.
అదే విధంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలిపారు.