మే 25
జనగాం ఈ విద్య సంవత్సరం కి సంబందించి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే లోపే అన్నీ పాఠశాలలకు పుస్తకాలు చేరాలని ప్రతీ విద్యార్థి కి పుస్తకాలని అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
జిల్లా పాఠశాల విద్యా శాఖ పుస్తకాల గోదాం లో ఉన్న పాఠ్య పుస్తకాలని
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
చేతుల మీదుగా....సోమవారం బచ్చన్నపేట మండలంతో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....
జూన్ 1వ తేదీ లోపు మొత్తం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు
జాగ్రత్తగా అన్ని పుస్తకాల అకౌంట్ ను రికార్డు చేసి అందించడమే కాకుండా... రాబోయే వర్క్ బుక్స్ అకౌంట్ ని సక్రమంగా నిర్వహించాలని, చెదలు,ఎలుకల బారిన పడకుండా అమర్చి మండలాలకు సకాలంలో అందజేయాలన్నారు
రెండవ సెట్ పుస్తకాలు వచ్చేనాటికి IDOC లోకి గోడౌన్ తరలించేలా అవసరమైన స్థలాన్ని కేటాయిస్తానని తెలియజేసారు.
అలాగే గోడౌన్ ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల కు కాంపౌండ్ వాల్ అంచనా ప్రతిపాదనలను అందించాల్సినది గా ఆదేశించారు.
తద్వారా బాలబాలికలకు సురక్షితమైన ఆట స్థలం అందుబాటులో ఉంటుందన్నారు
ఈ కార్యక్రమము లో NT Books మేనేజర్,జీ సీ డి ఓ గౌసియా బేగం, CMO నాగరాజు బచ్చన్నపేట్, జనగాం మండలాల మండల విద్యాధికారులు శంకర్రెడ్డి,వెంకటరెడ్డి,పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ నోడల్ టీం మెంబెర్స్ కేశవరావు, మధు రెండు మండలాల CRP లు పాల్గొన్నారు.