• Other News
  • Live TV
  • ప్రజా ప్రభుత్వ లక్ష్యాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin May 23, 2026, 4:10 pm
    ప్రజా ప్రభుత్వ లక్ష్యాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    రాజన్న సిరిసిల్ల, మే -23ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 25 నుండి 30 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, సమన్వయంతో ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

    ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 25 నుండి 30 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలపై మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, మెప్మా శాఖల అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా వారోత్సవాల సందర్భంగా రోజూ వారీగా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


    మే 25 వ తేదీన పోషకాహార మిషన్ కార్యక్రమంలో భాగంగా పోషకాహార వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేసి, సే నో టూ జంక్ ఫుడ్ పై అవగాహన, వంటల పోటీలతో పాటు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

    మే 26 వ తేదీన బాల్య వివాహాల నిర్మూలన తెలంగాణ లక్ష్యంగా బాల్య వివాహం – బతుకు ఆగం పేరుతో బాల్య వివాహాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పోస్టర్లు, పాంప్లెట్లు, గోడలపై చిత్రలేఖనం, తదితర ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.

    బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి, మత పెద్దలు, కల్యాణ మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి,1098, 181 సేవలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు.

    అలాగే నూతన మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి పాస్ బుక్ లు అందజేసి, సన్మానం చేయాలని ఆదేశించారు.

    మే 27 వ తేదీన మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు, షీ టీమ్స్ సమన్వయం, కార్యాలయాల్లో POSH నిబంధనల అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులకు లోన్ మేళా నిర్వహించాలని అన్నారు.


    మే 29 వ తేదీన జిల్లాలో నూతన అంగన్‌వాడీ కేంద్రాలు, వీఓ భవనాలు, మెప్మా ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో క్యాంటీన్ ప్రారంభించాలని సూచించారు.


    ఈ నెల 30వ తారీఖున అమ్మ మాట అంగన్వాడి బాట పేరుతో అంగన్వాడి బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల నిండిన పిల్లలకు ప్రాథమిక పాఠశాలకు పంపించడానికి విద్యారంభ్ సర్టిఫికెట్లు అందజేయాలని అలాగే సూచించారు. అలాగే కొత్తగా అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పిల్లల్ని చేర్చుకోవడం, పిల్లల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

    అలాగే జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

    సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీ నారాయణ, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login