మే 19
జనగామజనగామ జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఆల్ ఇండియా కెమిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు అత్యవసర మందుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ బాల కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మెడికల్ షాపుల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేశారు.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మందులు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ఫార్మసీలు అత్యవసర సేవల నిమిత్తం సాధారణంగా పనిచేయనున్నవని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా కొన్ని మెడికల్ షాపుల ఫోన్ నంబర్లు సంబంధిత షాపుల వద్ద ప్రదర్శించనున్నారని, అవసరమైన సందర్భాల్లో ప్రజలు ఆయా ఫోన్ నంబర్లను సంప్రదించి, మందుల సరఫరా, ఇతర సహాయం పొందవచ్చన్నారు.
ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా అవసరమైన మందులను సాధారణ విధంగానే కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా మందుల లభ్యతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు.
ఫిర్యాదులు/సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్లు:
📞 టోల్ ఫ్రీ నంబర్ : 1800 425 660
📞 డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, జనగామ : 9849634754, 8333925867
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.