పెద్దపల్లి, మే-18:దివ్యాంగుల సాధికారతకు సహాయ ఉపకరణాలు ఎంతో దోహదం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
పెద్దపల్లి పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ALIMCO సంస్థ ఆధ్వర్యంలో, సమగ్ర శిక్ష మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం పెద్దపల్లి సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. దివ్యాంగులు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావడానికి అవసరమైన సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సహాయ ఉపకరణాలు వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ క్యాంప్‌లో మొత్తం 75 మంది దివ్యాంగులకు 94 ఉపకరణాలు అందజేశారు. వాటిలో ట్రై సైకిళ్లు, 6 సీపీ చెయిర్లు, 40 టీఎల్‌ఎం కిట్లు, 1 విజువల్లి ఇంపెయర్డ్ కిట్ (సుగమ్య కేన్), 18 వీల్ చెయిర్లు, 28 హియరింగ్ ఎయిడ్స్, 1 రోలేటర్ పంపిణీ చేశారు.
దివ్యాంగులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం ద్వారా వారి దైనందిన జీవితంలో మరింత స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, సీఎంఓ కవిత, కోఆర్డినేటర్ మల్లేష్ గౌడ్, హెచ్‌ఎం అరుణ , అన్ని మండలాల ఐఈఆర్‌పీలు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది