• Other News
  • Live TV
  • జనగామ జిల్లాలో నూతన సభ్యుల చేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

    Reporter
    admin May 18, 2026, 2:57 pm
     జనగామ జిల్లాలో నూతన సభ్యుల చేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

    సమాజంలోని అవసరార్థులను ఆదుకోవడంలో ప్రత్యేకించి రక్తలేమీ లాంటి క్లిష్ట సమయాలలో సేవ చేసే రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించేందుకు అనువుగా సభ్యుల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జనగామ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

    జనగామ రెడ్ క్రాస్ సొసైటీ సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన కొత్త సభ్యుల చేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... సేవాభావం ఉన్న ప్రతి వయోజనులైన ప్రతి స్త్రీ పురుషులు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా చేరాలని కలెక్టర్ కోరారు.

    జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన ఈ జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు విస్తృత పరచడం అవసరం అని, ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఎక్కువ సేవలు చేయవచ్చునని అన్నారు.

    త్వరలో రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో రెడ్ క్రాస్ సొసైటీ ల నూతన కార్యవర్గములను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించనున్నారని జూన్ 15 లోగా సభ్యులు గా చేరే వారికి ఇందులో పాల్గొనే అవకాశం ఉంది కనుక సభ్యులు గా చేయాలనుకునే వారు ఈ లోగా చేరాలని కలెక్టర్ తెలిపారు.

    అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. బెన్ షాలోం మాట్లాడుతూ... జిల్లా అధికారులు, పుర ప్రముఖులు అందరూ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గా చేరాలని కోరారు.

    రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా డి. లవకుమార్ రెడ్డి మాట్లాడుతూ... రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను వివరించారు. సభ్యత్వ ఫారాలు జిల్లా నోడల్ అధికారి లేబర్ ఆఫీసర్ ఎంప్లాయిమెంట్ ఇంచార్జి అధికారి కార్యాలయం, ప్రణామ్ డే కేర్ సెంటర్ లో లభిస్తాయని తెలిపారు.

    ఈ కార్యక్రమం లో...
    జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మల్లికార్జున రావు, కార్యదర్శి కన్న పరశురాములు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు డా. లక్ష్మీ నారాయణ నాయక్, అల్లాడి ప్రభాకర్ రావు, క్రిష్ణ జీవన్ బజాజ్, పేర్వారం ప్రభాకర్, టి వెంకట మల్లారెడ్డి, తీగల సిద్దిమల్లయ్య, క్యాథరీన్, అంబటి రాజయ్య దూడల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login