మే 18
జనగామప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా.. అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్, వార్డు నంబర్ 1 కు చెందిన కె. రేణుక, తనకు ఇల్లు లేదని, కిరాయికి ఉంటున్నారని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకు మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
కంచనపల్లి గ్రామం, రఘునాథపల్లి మండలానికి చెందిన జీగిరి నరేష్, తనకు పెంకుటిల్లు ఉందని, ఆ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయిందని, గృహ, వస్తు, ధన నష్టం వాటిల్లిందని, ఈ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుట కోసం దరఖాస్తు చేసియున్నారు.
యశ్వంతాపూర్ గ్రామం, జనగామ మండలానికి చెందిన బొట్ల మహేష్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో చోటు కల్పించుట గురించి ఆర్జీ ద్వారా కోరారు.
కుందారం గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన ఆర్. రమ, తను చాలా నిరుపేదలం అని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందించనైనది.