ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట, మే 14 కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్, గంభీరావుపేట మండల కేంద్రం, మండలంలోని మల్లారెడ్డిపేట, ముస్తాఫానగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం తనిఖీ చేశారు. లారీల కొరత లేకుండా వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.
అలాగే గంభీరావుపేట మండలం లింగన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, లక్ష్మీనారాయణ ఇండస్ట్రీస్, కొత్తపల్లిలోని వాయుపుత్ర ఇండస్ట్రీస్ లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తనిఖీ చేసి.. ధాన్యం లారీలను వెంట వెంటనే అన్ లోడింగ్ చేయించాలని ఆదేశించారు. హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు.
పరిశీలనలో గంభీరావుపేట తహసీల్దార్ మారుతి రెడ్డి, అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.