నేటిప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్
రాజంపేట మండల కేంద్రంలో
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో గురువారం రాజంపేట మండలంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజంపేట మండలంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ శాలువాలతో సన్మానించి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌లో క్లాస్ రూమ్‌ల నిర్మాణ అవసరాన్ని , మారమ్మత్తుల అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా
AE PR ను వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ సర్పంచ్ గ్రామపంచాయతీ నిధుల నుంచి 50 శాతం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, మిగితా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాజు, తహసీల్దార్ హెడ్ మాస్టర్ ఈశ్వర్, సర్పంచ్ శ్రీకాంత్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.