గంగాధర మండలంలోని ఒద్యారం గ్రామంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో MPDO రాము గారి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో AAPC చైర్మన్ మాధవి గారు, సర్పంచ్ ఉమ గారు, ఉప సర్పంచ్ గగన్ గారు, జీపీ సెక్రటరీ శ్యామల గారు, పాలకవర్గ సభ్యులు, వార్డ్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు.
మొదట గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. తరువాత గ్రామ సభ నిర్వహించి “మన ఊరి పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి” అనే సంకల్పంతో చర్చలు జరిపారు.
గ్రామంలోని వార్డ్ సభ్యులు బాధ్యత తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాపట్ల కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చింది.
📚 సాధించిన అడ్మిషన్లు:
6వ తరగతి – 2
4వ తరగతి – 1
5వ తరగతి – 1
1వ తరగతి – 1
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు MEO ఏనుగు ప్రభాకర్ రావు గారు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, సౌకర్యాలు, విద్యార్థుల భవిష్యత్తు అవకాశాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.
“ప్రభుత్వ పాఠశాల – ప్రతి పిల్లవాడి హక్కు, ప్రతి గ్రామం గర్వం