- ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది శ్రీ. ఆడెపు వేణు గారు అన్నారు.
శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి.నీరజ గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, DLSA శ్రీ. పి.లక్ష్మణాచారి గారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ మరియు లైంగిక వేధింపుల నివారణ లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికర సంస్థ (NALSA) మార్గదర్శకాల మేరకు “జాగృతి” పథకం – 2025 కింద “సురక్షిత్ బచ్పన్ సురక్షిత్ భవిష్య” కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన
న్యాయ విజ్ఞాన సదస్సులో బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే పోక్సో చట్టం (POCSO Act – 2012) పై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఎలాంటి భయాందోళనలకు గురైనా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్. మల్లేశ్ యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.