[2:04 PM, 5/8/2026] +91 91822 11810: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు, శుక్రవారం ఘనపూర్ (స్టేషన్), జనగామ, పాలకుర్తి నియోజకవర్గ పరిధిల్లోని రైతు వేదికల వద్ద మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మత్స్య ఉత్పత్తి పెంపు, చెరువుల సమర్థ నిర్వహణ, చేపల వ్యాధుల నివారణ, కలుపు నియంత్రణ చర్యలు, ఆధునిక చేపల పెంపక విధానాలపై మత్స్యకారులకు అధికారులు వివరించారు.
అలాగే ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, చేప పిల్లల వితరణ, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల సభ్యులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
[4:36 PM, 5/8/2026] +91 91822 11810: ప్రెస్ రిలీజ్
మే 08
జనగామ