• Other News
  • Live TV
  • రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    Reporter
    admin May 8, 2026, 5:01 pm
    రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

    పెద్దపల్లి, మే 08: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

    శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, లిఫ్టింగ్, ట్యాబ్ ఎంట్రీలు, కొనుగోలు కేంద్రాల పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ప్యాడీ లోడింగ్ పనుల ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్‌చార్జ్‌లు సమర్థవంతంగా పర్యవేక్షించడం లేదని గమనించినట్లు తెలిపారు. ఇకపై ప్రతి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం వేగంగా రైస్ మిల్లులకు చేరేలా సెంటర్ ఇన్‌చార్జ్‌లు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.

    జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, కొనుగోళ్ల వేగాన్ని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత సీజన్‌లో రోజుకు 14 నుండి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయని, ప్రస్తుతం రోజుకు కేవలం 8 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు జరుగుతోందన్నారు. వెంటనే కొనుగోళ్ల వేగం పెంచి రోజుకు కనీసం 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. ప్రతి కేంద్రంలో హమాలీల సంఖ్యను వెంటనే పెంచాలని, రేపటి నుండి రెట్టింపు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగాలని తెలిపారు. ప్రతి కేంద్రం నుండి రోజువారీగా ఎక్కువ సంఖ్యలో వాహనాల ద్వారా ధాన్యం లిఫ్టింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు.

    ధాన్యం లోడింగ్ ప్రక్రియను తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు సెంటర్ ఇన్‌చార్జ్‌లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం వచ్చే వారం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

    ట్యాబ్ ఎంట్రీలు ప్రస్తుతం 80 శాతం వరకు మాత్రమే నమోదవుతున్నాయని, ఉదయం ఒక కేంద్రాన్ని సందర్శించినప్పుడు కేవలం 60 శాతం ఎంట్రీలు మాత్రమే నమోదై ఉన్నట్లు గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని వెంటనే సరిచేసి ఈరోజే 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

    రెండో శనివారం, ఆదివారం రోజుల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తప్పనిసరిగా పని చేయాలని, ధాన్యం కొనుగోళ్లు నిరంతరంగా కొనసాగాలని తెలిపారు. కొనుగోళ్ల సమయంలో తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ నిబంధనలు పాటించాలని సూచించారు.

    జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు స్థానిక రైతుల ధాన్యానికే రైస్ మిల్లుల్లో ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు కూడా అధికంగా రావడంతో హమాలీల కొరత తలెత్తే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హమాలీలను సమీకరించాలని అధికారులకు సూచించారు.

    ఈ సమావేశంలో డీసీవో శ్రీమాల,డీసీఎస్ఓ శ్రీనాథ్, అడిషనల్ డీఆర్‌డీవో రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైస్ మిల్ నిర్వాహకులు,లారీ అసోసియేషన్ అధ్యక్షులు,తదితరులు పాల్గొన్నారు.
    -----------------------------------------------------------------------
    జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login