ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ గారిని తన కార్యాలయంలో కలిసి సర్వే కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కరీంనగర్లో సర్వే చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను,గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన,అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు.తొలి విడతలో కుటుంబ యజమాని పేరు,సభ్యులు వారి విద్యా అర్హతల గురించి,చదువు మానేసిన,ఉన్నత చదువులు,వృత్తివిద్య కోర్సులు,ఉద్యోగం,స్వయం ఉపాధి,వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో,ఎన్ని గంటలు పని చేశారో,ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంట శ్రీనివాస్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నాగారపు హరికృష్ణ , మున్సిపల్ మెప్మాసెక్షన్ సిబ్బంది ఆర్పీలు రమ్య మరియు కల్పన మున్సిపల్ సిబ్బంది తంగళ్ళపల్లి కళ్యాణ్ మరియు తదితరులు పాల్గొన్నారు
TELANGANA KARIMNAGAR
కరీంనగర్లో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహణ ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **