*ప్రచురణార్థం డి సీ హెచ్ ఎస్ కార్యాలయం*
మంథని పట్టణానికి చెందిన 29 సంవత్సరాల ఒక యువకుడు ఈ నెల 16 రాత్రి 10 గంటలకు రోడ్డు ప్రమాదం లో తన బైక్ పై నుంచి డివైడర్ కు ఢీ కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో అతని కుడి చేయి తీవ్రంగా గాయపడి, తీవ్ర రక్త స్రావం జరిగింది, ఆ యువకుడు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పగా, వెంటనే స్పందించిన సూపరింటెండెంట్ గారు ఆ యువకుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పి, హుటాహుటిన జనరల్ సర్జరీ డాక్టర్ విష్ణు చంద్రికను పిలిపించి, లోతుగా అయిన గాయాలకు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్త స్రావాన్ని ఆపారు
తర్వాత సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కంది శ్రీనివాస్ రెడ్డి మరియు డా. వినయ్, వీరి తో పాటు మత్తు వైద్యురాలు డా. భవాని గార్లు సదరు యువకుడికి కండరాలు ,నరాలు,రక్త నాళాలను అత్యంత నైపుణ్యం తో 3 గంటలు శ్రమించి శస్త్ర చికిత్స నిర్వహించడం జరిగింది
సదరు పేషెంట్ ను పూర్తిగా కోలుకున్న అనంతరం నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది
విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష గారు ,వైద్య బృందాన్ని అభినందించడం జరిగింది.
TELANGANA PEDDAPALLI
*క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు నిలయంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి*
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **