• Other News
  • Live TV
  • మార్గదర్శకత్వంలో నిరుద్యోగ యువత,యువకులు కు మహిళా సంఘాలు కు ఉద్యోగ అవకాశాలు

    Reporter
    admin April 21, 2026, 3:39 pm
    మార్గదర్శకత్వంలో నిరుద్యోగ యువత,యువకులు కు    మహిళా సంఘాలు కు ఉద్యోగ అవకాశాలు

    జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) జనరల్ మేనేజర్ టి . హనుమంతు గారి మార్గదర్శకత్వంలో నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు (SHGs), విద్యార్థులు మరియు ఆసక్తి గల వ్యాపారులకు వివిధ ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు, మహిళా సంఘాలకు మరియు విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. MSME పథకాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలను వినియోగించుకుని యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని సూచించారు.
    PMEGP పథకం:
    Prime Minister’s Employment Generation Programme కింద:
    • తయారీ రంగానికి గరిష్టంగా ₹50 లక్షలు
    • సేవల రంగానికి గరిష్టంగా ₹20 లక్షలు
    • ₹10 లక్షల వరకు శూరిటీ ఫ్రీ లోన్
    • 15% నుండి 35% వరకు సబ్సిడీ
    PMFME పథకం (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు):
    Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprises కింద:
    • వ్యక్తిగతంగా ₹10 లక్షల వరకు ప్రాజెక్టులు
    • SHGs/గ్రూపులకు ₹3 కోట్ల వరకు ప్రాజెక్టులు
    • 35% సబ్సిడీ అందుబాటులో ఉంటుంది
    టి-ప్రైడ్ (T-PRIDE) – SC/ST వ్యాపారుల కోసం:
    Telangana Program for Rapid Incubation of Dalit Entrepreneurs కింద:
    • MSME యూనిట్లు మరియు కమర్షియల్ వాహనాలకు సహాయం
    • పెట్టుబడి సబ్సిడీ
    • విద్యుత్ ఛార్జీల సబ్సిడీ
    • స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్
    • వడ్డీ సబ్సిడీ
    • SGST రీయింబర్స్‌మెంట్
    • SC/ST, మహిళలు, గ్రామీణ వ్యాపారులకు ప్రత్యేక ప్రోత్సాహం
    టి-ఐడియా (T-IDEA) – జనరల్ & OBC వర్గాల కోసం:
    Telangana Industrial Development and Entrepreneur Advancement Scheme కింద:
    • పెట్టుబడి సబ్సిడీ
    • విద్యుత్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్
    • స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్
    • వడ్డీ సబ్సిడీ
    • SGST రీయింబర్స్‌మెంట్
    ఉద్యమ్ రిజిస్ట్రేషన్ (Udyam Registration):
    ప్రతి వ్యాపారి తప్పనిసరిగా Udyam Registration పొందాలి. ఇది పూర్తిగా ఉచితం.
    రిజిస్ట్రేషన్ కోసం కలెక్టర్ కార్యాలయంలోని MSME-EDC సెంటర్‌ను సంప్రదించవచ్చు:
    • జిల్లా మేనేజర్ K. Jayanth గారు
    • అసిస్టెంట్ మేనేజర్ T. Venkata Shiva Sai గారు
    ఉపాధి అవకాశాలు – DEET యాప్:
    DEET App ద్వారా:
    • మండల, జిల్లా స్థాయిలో ఉద్యోగ అవకాశాలు
    • సమీప పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు
    • నమోదు సమయంలో DIC రిఫరల్ కోడ్ RJS001JS ఉపయోగించండి.
    ఇంటర్న్షిప్ అవకాశాలు:
    PMIS (Prime Minister Internship Scheme):
    • ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు
    • నెలవారీ స్టైపెండ్
    • నైపుణ్యాభివృద్ధి & ఉద్యోగ అవకాశాల పెంపు
    • గరిష్టంగా 9,000 రూపాయలు నెలకి స్టైపెండ్ , సంవత్సర కాల పరిమితి .
    NATS 2.0 (National Apprenticeship Training Scheme):
    • డిప్లొమా & డిగ్రీ విద్యార్థులకు శిక్షణ
    • 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు శిక్షణ
    • స్టైపెండ్ (DBT ద్వారా)
    • పరిశ్రమ అనుభవం పొందే అవకాశం
    జిల్లా పరిశ్రమల కేంద్రం మరియు MSME-EDC సెంటర్, కలెక్టర్ కార్యాలయంలో పై వివరాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
    అందువల్ల నిరుద్యోగ యువత, విద్యార్థులు మరియు వ్యాపారులు ఈ అవకాశాలను వినియోగించుకొని స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని జనరల్ మేనేజర్ గారు సూచించారు.

    టి . హనుమంతు రాజన్న సిరిసిల్లా

    జనరల్ మేనేజర్
    జిల్లా పరిశ్రమల కేంద్రం



    .

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర