ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ - 21 రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు.
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం ప్రారంభించారు. ధాన్యం కుప్పలు, తేమ శాతం పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దించుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు.