కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి నాగరాణి హెల్మెట్ల ను,ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాత లేని, మహనీయుల జయంతుల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని,సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ బాలు ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని, నిబంధనలను పాటించాలని సూచించారు.కార్యక్రమాన్ని నిర్వహించిన ఐవిఎఫ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,ప్రధాన కార్యదర్శి ఎర్రం విజయ్ కుమార్,యువజన విభాగం అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్, కొమిరిశెట్టి గంగ రాజం,అర్వపల్లి రమేష్,కూర దిగంబర్, తాటిపాముల సుధాకర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.