తేమ శాతం వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని... వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
మంగళవారం లింగాల ఘనపూర్ మండలం కుందారం, నెలపోగుల, వనపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించి... కేంద్రాలలో నిర్వాహకుల పని తీరు, మౌలిక వసతులు మొదలైన వాటిని పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుం దని, ఈ క్రమంలో రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాల నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎలాంటి ఆలస్యం లేకుండా పక్కాగా టోకెన్ విధానాన్ని అనుసరిస్తూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలన్నారు
ధాన్యం విక్ర యించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం తాగునీరు, నీడ, మౌలిక వసతులు కల్పించడంతో పాటు గన్నీ సంచులు, టార్పాలి న్లు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొను గోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.