• Other News
  • Live TV
  • విద్యార్థుల్లో సృజనాత్మక వెలికితీతకే పోటీలు పకడ్బందీగా సంక్షేమ వారోత్సవాలు అమలు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin April 21, 2026, 3:16 pm
    విద్యార్థుల్లో సృజనాత్మక వెలికితీతకే పోటీలు  పకడ్బందీగా సంక్షేమ వారోత్సవాలు అమలు  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    తంగళ్లపల్లి, ఏప్రిల్ - 21ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.


    ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

    ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు.


    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన
    ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.

    ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు
    సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
    రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు.

    విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.


    కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login