• Other News
  • Live TV
  • వానకాలం పంటల సాగుకు సన్నద్ధం కావాలి – జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు

    Reporter
    admin April 17, 2026, 4:39 pm
    వానకాలం పంటల సాగుకు సన్నద్ధం కావాలి – జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు

    కరీంనగర్ ADA కార్యాలయం లో జిల్లా వ్యవసాయ అధికారి, ఆధ్వర్యంలో వానకాలం (ఖరీఫ్) పంటల సాగుకు సంబంధించి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. రాబోయే వానకాలం సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
    1.వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    2.Farmer Registry గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, వంటి సేవలు ఫార్మర్ రిజిస్ట్రీకి తప్పనిసరి అనుసంధానమై ఉంటాయని, అందువల్ల ,ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా AEOలు గ్రామ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానికంగా లేని రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ సమీప మీ(Mee Seva)సేవ కేంద్రాల్లో కూడా చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని AEO మెసేజ్ ద్వారా కానీ ఫోన్ చేయడం ద్వారా గాని తప్పనిసరిగా అట్టి రైతులకు తెలియజేయాలని సూచించారు.
    వచ్చే నెలలోపు ఈ ప్రక్రియ 100% పూర్తి కావాలని AEO లకు ఆదేశాలు జారీ చేశారు.

    3.Digital Crop Booking (e-Crop) కార్యక్రమాన్ని కూడా సమయానికి పూర్తి చేయాలని, ప్రతి రైతు పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో నష్టపరిహారం, ఇతర ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు. అందుకుగాను AEOలు మరియు DCS వాలంటీర్స్ సమన్వయంతో పనిచేసి 100% డిజిటల్ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని సూచించారు.

    4.పంటల మార్పిడి (PMO) పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంటూ, ముఖ్యంగా పప్పు ధాన్యాలు (Pulses), చిరు ధాన్యాలు (Millets), నూనె గింజలు (Oilseeds) సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

    5.అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు Soil Volunteer ను గుర్తించి, వారికి మట్టి పరీక్షలు, మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దీని ద్వారా రైతులు సిఫారసు మేరకు ఎరువులు వాడి పంటల ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు దిగుబడులను పెంచుకోవచ్చని తెలిపారు.

    6.రైతులు తమ మొబైల్ నంబర్లను వ్యవసాయ విస్తరణ అధికారుల (AEOs) వద్ద తప్పనిసరిగా update చేసుకోవాలని, తద్వారా యూరియా యాప్ , ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, వ్యవసాయ సలహాలు నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవచ్చని ఆమె వివరించారు.

    7.కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ, వెజిటేబుల్ వాలంటీర్స్ కూడా నియమిస్తుందని వారి సేవలు కూడా వ్యవసాయ విస్తరణ అధికారులు , వరి నుండి కూరగాయలు మరియు ఆయిల్ ఫామ్ పంటలకు మార్పిడి చేయుటకు వారిని ఉపయోగించుకోవాలని తెలిపారు.

    ఈ సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ రణధీర్ రెడ్డి గారు, కరీంనగర్ అర్బన్, రూరల్ మరియు కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారులు శ్రీ వంశీ కృష్ణ, శ్రీ సత్యం, శ్రీ సంతోష్ కుమార్ గార్లు, అలాగే AEOలు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login