రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -15
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)విద్యార్థులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం అభినందించారు.
ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, జిల్లాలోని ప్రథమ సంవత్సరంలో సిరిసిల్ల కేజీబీవీ
బీపీసీలో కీర్తన 436/440, మర్రిపల్లి కేజీబీవీ ఎంపీసీలో బీ మమత 466/470, రుద్రంగి కేజీబీవీ ఎంపీసీలో జీ మమత 466/470 మార్కులు సాధించారు. తంగళ్లపల్లి కేజీబీవీ ఎంపీ హెచ్ డబ్ల్యూలో ఎల్ శృతికి490 /500, వేములవాడ కేజీబీవీ ఏఐఎంఎల్ లో అక్షిత 486/500, మర్రిపల్లి కేజీబీవీలో జీ శ్యామల ఎంపీసీలో 984/1000 మార్కులు సాధించిన సందర్భంగా ఆ విద్యార్థులు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలువగా, వారిని అభినందించారు.