• Other News
  • Live TV
  • ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

    Reporter
    admin April 6, 2026, 3:52 pm
    ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

    9 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని రెండవ అంతస్తులో గల కాన్ఫరెన్స్ హాల్లో ఆహార నిర్వాహకులకు (వంటవాళ్లు, పాఠశాల/వసతి గృహాల వార్డెన్లు, వంటశాల సిబ్బంది) ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

    ఆహార భద్రతా అంశాలపై వివరణ
    ఈ సందర్భంగా ఆహార పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, సరైన ఆహార నిర్వహణ విధానాలు, ఆహారంలో కలిగే ప్రమాదాల గురించి, ముఖ్యంగా రసాయన (Chemical), జీవ సంబంధ (Biological) హానికర అంశాలు ఎలా ఆహారాన్ని ప్రభావితం చేస్తాయో ట్రైనర్ తెలియజేశారు.

    అలాగే ఆహారం కలుషితత (Contamination) ఎలా జరుగుతుందో, దానిని నివారించే మార్గాలను సూచించారు.

    ఆహార భద్రతా చర్యలు – పాటించాల్సిన నియమాలు
    ఆహారాన్ని తయారు చేసే వారు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆప్రాన్, హెడ్ క్యాప్, మాస్క్ వంటి వాటిని ధరించడం ఎంతో అవసరమని తెలిపారు. వంట చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, వాడే పాత్రలు శుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు.

    ఆహార నిర్వహణలో జాగ్రత్తలు
    ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయడం, వేడి, చల్లని పదార్థాలను వేర్వేరుగా ఉంచడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఆహారాన్ని సరిగ్గా వండడం, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.

    ఈ అవగాహన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, ఏబీసీడీఓ రవీందర్, ట్రైనర్ వేణుగోపాల కృష్ణ, కుక్ లు, వసతి గృహాల వార్డెన్లు, వంటశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login