• Other News
  • Live TV
  • విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించండి: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

    Reporter
    admin April 6, 2026, 3:48 pm
    విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించండి: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

    మహిళలలు విద్యార్థినుల భద్రతను కాపాడేందుకు జిల్లాలో షీ టీమ్ బృందం నిరంతరం చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని మహిళలకు,విద్యార్థినులకు సూచించారు.

    మార్చ్ నెలలో షీ టీమ్‌కు అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటూ 03 FIRలు,04 పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది.మహిళలను,విద్యార్థినులను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి,వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందనీ తెలిపారు

    మహిళలు, విద్యార్థినులు ఎక్కడైనా వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.రోడ్డు,బస్టాండ్ లు ,విద్యాసంస్థలు,ఉద్యోగ ప్రదేశాల్లో ఎవరైనా అవహేళనగా మాట్లాడినా, వెంబడించినా వెంటనే షీ టీమ్‌కు నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేయలని,ప్రతి ఫిర్యాదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    షీ టీమ్ బృందం జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు , ప్రజా ప్రదేశాల్లో ర్యాగింగ్,ఇవ్‌టీజింగ్,పోక్సో, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారని,ముఖ్యంగా
    విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం ఉండాలని సూచించారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర