• Other News
  • Live TV
  • ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

    Reporter
    admin March 30, 2026, 4:33 pm
    ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

    భారత విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (NCERT) మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (SCERT) ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ (FLS) పరీక్షలు ఈ నెల 30 మరియు 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల నుండి ఎంపిక చేసిన మొత్తం 407 పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

    ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశ్యం 3వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు, లెక్కల సామర్థ్యాలను (Foundational Literacy & Numeracy) అంచనా వేయడం. భవిష్యత్ విద్యా ప్రణాళికల రూపకల్పనకు ఈ సర్వే ముఖ్య ఆధారంగా నిలవనుంది.

    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 20 పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. జిల్లావారీ వివరాలు:
    • కరీంనగర్ – 8 పాఠశాలలు
    • జగిత్యాల – 6 పాఠశాలలు
    • పెద్దపల్లి – 3 పాఠశాలలు
    • సిరిసిల్ల – 3 పాఠశాలలు

    ప్రతి పాఠశాలలో 3వ తరగతి 12 మంది విద్యార్థులను నమూనాగా ఎంపిక చేసి, రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
    • మొదటి రోజు – 6 మంది విద్యార్థులు
    • రెండో రోజు – 6 మంది విద్యార్థులు

    ఈ పరీక్షలను డిజిటల్ విధానంలో ట్యాబ్‌ల ద్వారా నిర్వహించడంతో పాటు, అవసరమైన చోట రాతపరీక్షకు సంబంధించిన పత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. పరీక్షలో భాషలో 9 అంశాలు, సంఖ్యాజ్ఞానంలో 9 అంశాలు ఉంటాయి.

    ఈ కార్యక్రమం నిర్వహణ కోసం డైట్ కరీంనగర్ ఛాత్రోపాధ్యాయులకు ఈ నెల 26 మరియు 28 తేదీలలో ప్రత్యేక శిక్షణ అందించబడింది. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల సహకారంతో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

    విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేసి, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఈ సర్వే కీలక పాత్ర పోషించనుంది.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర