పెద్దపల్లి, మార్చి-26:
----------------------------------
గ్రామాలలో 100% పన్ను వసూళ్ల పై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రతి నిర్మాణం యొక్క అసెస్మెంట్ 100% పూర్తి చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఆస్తి పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జర్గకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
మండల కేంద్రాలలో ఉన్న వ్యాపార సంస్థల యొక్క సంపూర్ణ వివరాలు దగ్గర అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో రైస్ మిల్లర్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను మూసి వేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆర్టిసి బస్ స్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు , వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని, పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా డిమాండ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామాలలో అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో తొలగించాలని అన్నారు. రోడ్ల పై చెత్త ఉండకుండా రెగ్యులర్ పారిశుధ్య చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, మధ్యం షాపుల వద్ద చెత్త ఉంటే భారీ స్థాయిలో జరిమానాలు విధించి సేకరించాలని కలెక్టర్ తెలిపారు.
ఏప్రిల్ 2న జరిగే గ్రామ సభ కు పటిష్ట ఏర్పాట్లు చేయాలి, గ్రామ సభ లో ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు, గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను, ఆర్థిక సంఘం నిధుల వినియోగం పై ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామ సభ కార్యక్రమం పై ముందస్తుగానే ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఏప్రిల్ 16 న మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలకు స్వశక్తి మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ శాఖలలో ఏమైనా ఆస్తుల పంపిణీ ఉంటే ఆరోజు పెట్టుకోవాలని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డి ఎల్ పి ఓ లు, ఎంపీ ఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.