• Other News
  • Live TV
  • రూ.5 లక్షల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కేవలం మూడు నెలల్లోనే పనులన్నీ పూర్తి

    Reporter
    admin March 26, 2026, 1:08 pm
    రూ.5 లక్షల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం  కేవలం మూడు నెలల్లోనే పనులన్నీ పూర్తి

    రాజన్న సిరిసిల్ల, మార్చి -26
    ------------------------------------

    ఇల్లు లేని వారి సొంత ఇంటి కల నిజం చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది. మోడల్ హౌస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. 400 చదరపు ఫీట్లలో రూపాయలు ఐదు లక్షలతో ఇల్లు పూర్తవుతుందని స్పష్టం చేసింది గృహ నిర్మాణ శాఖ. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతోనే నూతన సాంకేతికత, అద్భుతమైన డిజైన్ లో స్లాబ్ తో ఇందిరమ్మ ఇల్లు పక్కాగా నిర్మించింది.

    ప్రజా ప్రభుత్వం అర్హులైన వారి సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్దేశించిన 400 నుంచి 600 చదరపు ఫీట్ల వరకు నిర్మించుకోవచ్చని, వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో నిర్మాణానికి అనుగుణంగా నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. పేదలకు 400 చదరపు ఫీట్లలో రూపాయలు ఐదు లక్షలు ఇల్లు నిర్మించుకునేలా స్పష్టమైన కార్యాచరణ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో గృహ నిర్మాణ శాఖ మోడల్ నిర్మాణాలను జిల్లాలో చేపట్టింది.

    జిల్లాలో 11 నిర్మాణాలు పూర్తి..

    గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 11 మోడల్ ఇందిరమ్మ మోడల్ ఇండ్లను 400 చదరపు ఫీట్లలో ఒక ప్రణాళిక ప్రకారం కేవలం మూడు నెలల కాలంలోనే రూ. ఐదు లక్షలతో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.

    ఇబ్బందులు దూరం చేసేందుకు కమిటీల సేవలు

    గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మోడల్ హౌస్ లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రతి మోడల్ హౌస్ లో ఒక హాల్, బెడ్ రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూం, అలాగే కిచెన్ సదుపాయాలతో ఇంటిని పూర్తి చేశారు. గోడల నిర్మాణానికి సిమెంటు ఇటుకలు వినియోగించారు. కిటికీలు, దర్వాజలు చెదలు పట్టకుండా చాలా కాలం మన్నికగా ఉండేలా సిమెంటు ఫ్రేములు వినియోగించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయం అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. ఇంటి నిర్మాణ సామగ్రి, ఇతర ఇబ్బందులను దూరం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

    ఎండాకాలం చల్లగా.. చలికాలం వెచ్చగా ..

    ఇందిరమ్మ మోడల్ హౌస్ లు ఎండాకాలంలో చల్లగాను.. చలికాలంలో వెచ్చగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించారు. స్లాబు నిర్మాణంలో ఫిల్లర్ రూఫింగ్ విధానాన్ని వినియోగించారు. ఇందులో సాధారణ ఇళ్లతో పోలిస్తే స్లాబ్ నిర్మాణంలో 40 శాతం ఖర్చు ఆదా అవుతుంది. కాంక్రీట్, ఐరన్ తక్కువగా ఉపయోగిస్తారు. స్లాబ్ చూడడానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది.

    దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండేలా..

    గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రూ. 5 లక్షలలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. నాణ్యతలో కూడా ఇలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేశారు. దీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక సహాయం లోనే ఇంటి నిర్మాణాన్ని చేశారు.

    ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ..

    జిల్లాలోని అర్హులైన వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఐదు లక్షల తోనే పూర్తిచేసేలా ప్రతి మండల కేంద్రం అలాగే మున్సిపాలిటీలో హౌసింగ్ అధికారులు పూర్తిస్థాయి సహకారం అందిస్తారు. అర్హులైన వారందరూ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login