రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2026, తేదీ: 14.03.2026 మొదటిరోజున ప్రశాంతంగా జరిగినవి. జిల్లా నందు (34) పరీక్షా కేంద్రాలలో (7307) మంది విద్యార్థులకు గాను (99.89%) హాజరుశాతంతో (7299) మంది విద్యార్థులు హాజరైనారు మరియు (8) మంది విద్యార్థులు గైర్హాజరు అయినారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) శివనగర్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నెహ్రూనగర్ సిరిసిల్ల పరీక్షా కేంద్రాలను, జిల్లా SP గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) గీతానగర్ సిరిసిల్ల పరీక్షా కేంద్రo మరియు రెండు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు (10) పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని గౌరవ జిల్లా విద్యాధికారి శ్రీ. డా. బి. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా విద్యాధికారి (ఎఫ్.ఎ.సి.)
రాజన్న సిరిసిల్ల