• Other News
  • Live TV
  • మార్చి 09 జనగామ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలికోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం మహిళలు అన్ని రంగాల్లో ముందంజ ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin March 9, 2026, 4:35 pm
    మార్చి 09 జనగామ  మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలికోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మహిళలు అన్ని రంగాల్లో ముందంజ  ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఘనపూర్ (స్టేషన్) మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య రెడ్డి, చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ శ్రీధర్ రావు, గ్రంథాలయ సంస్థ కమిటీ ఛైర్మన్ మారుజోడు రాంబాబుతో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు.

    ఈ సందర్భంగా ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముందుగా అందరు మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారన్నారు. అందులో ప్రధానంగా భారతదేశంలో సావిత్రి భాయి ఫూలే, దుర్గాబాయి దేశ్ముఖ్ విద్యాలయాలను నెలకొల్పి, బాలికా విద్య కొరకు కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే శిస్తుకు వ్యతిరేకంగా కాకతీయ రాజులకు ఎదురు తిరిగిన ధీరవనితలైన సమ్మక్క - సారక్కలు స్ఫూర్తిదాయకమన్నారు. భూమి కోసం - భుక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎంతగానో కొనియాడారు.

    నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, కోట్లలో వ్యాపారం చేస్తున్న మహిళా సంఘాలు ఉన్నాయని, అది దేశానికే చాలా గర్వకారణమని తెలిపారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవస్థను విస్తరించడంతో పాటు మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటూ, తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

    నిజమైన మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఓ తండ్రి తన కుమార్తెకు “నీ కలలు కూడా అంతే ముఖ్యమైనవి” అని చెప్పినప్పుడు అది ప్రారంభమవుతుందని, పాఠశాలలో బాలికలను ప్రశ్నలు అడగడానికి, పోటీపడడానికి, నాయకత్వం వహించడానికి ప్రోత్సహించినప్పుడు అది ప్రారంభమవుతుందని, అలాగే సమాజంలో మహిళల భద్రత కేవలం వారి సమస్యగా మాత్రమే కాకుండా అందరి బాధ్యతగా భావించినప్పుడు అది నిజంగా ఆచరణలోకి వస్తుందని తెలిపారు.

    తదనంతరం జిల్లా అధికారులను శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. అదే విధంగా వివిధ శాఖల ఉద్యోగినులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు.

    ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, డీసీపీఓ రవికాంత్, మిషన్ శక్తి కో-ఆర్డినేటర్ శారద, పలు శాఖల జిల్లా అధికారులు, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login