• Other News
  • Live TV
  • ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి 157 ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ‌ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా .....

    Reporter
    admin March 9, 2026, 3:59 pm
    ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి   157  ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ‌  జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా .....

    జిల్లా లో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ఆర్జీదాల‌ను ద‌ర‌ఖాస్తుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అధికారుల‌ను ఆదేశించారు.

    సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీదారుల సమస్యల గురించి తెలుసుకుంటూ (157) అర్జీల‌ను స్వీక‌రించారు.

    అలాగే ద‌ర‌ఖాస్తుల పై ఎండార్స్మెంగ్ చేసి సంబంధిత శాఖ‌ల అధికారుల అంద‌జేశారు. స్వీక‌రించిన ఆర్జీల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని, క్షుణ్ణంగా ప‌రిశీలించి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిశీలించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

    ఈ సందర్భంగా స్వీకరించిన పలు ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి..

    జ‌న‌గామ మండలం, గానుగుప‌హాడ్ గ్రామానికి చెందిన బింగి వెంక‌ట‌మ్మ తన భర్త బిక్ష‌ప‌తి, విక‌లాంగుల పెన్ష‌న్ పొందుతూ మరణించాడని, త‌ను కూడా దివ్యాంగురాలు అయినందున నాకు నా భ‌ర్త ఫిన్ష‌న్ అయినా ఇప్పించండి లేదా కొత్త‌గా విక‌లాంగుల పింఛను మంజూరు చేయాల‌ని వేడుకుంటూ ద‌ర‌ఖాస్తు చేసియున్నారు.

    పెంబ‌ర్తి గ్రామ నివాసి అయిన కంతిరి వ‌నిత‌, భ‌ర్త ర‌మేష్ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాల‌ని విన్నవిస్తూ ద‌రఖాస్తు అందించారు.

    సంజ‌య్‌న‌గ‌ర్ , 16 వార్డు, జ‌న‌గామ కు చెందిన యండి. నూర్జ‌హాన్ చాలా సంవ‌త్స‌రాల నుండి కిరాయి ఇంట్లో ఉంటున్నాను, నేను నిరుపేద‌ను అయినందున డ‌బుల్ బెడ్ రూము కోసం విన్న‌విస్తూ ఆర్జీ ని సమ‌ర్పించారు.

    ఈ ప్ర‌జావాణిలో ఆర్డీఓలు గోపీరాం, డి.య‌స్‌. వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మ‌ల్జిఖార్జున్ రావు, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర