పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి దివ్యాంగ క్రీడా పోటీల్లో
కరీంనగర్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లాలోని చిగురుమామిడి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగవిద్యార్థులు అండర్ 14, అండర్ 17 రన్నింగ్ పోటీల్లో విజయం సాధించారు. చిగురుమామిడి భవిత కేంద్రానికి చెందిన రెంటాల సాత్విక్ రెడ్డి అండర్ 14 మానసిక దివ్యాంగుల రన్నింగ్ విభాగంలో మూడో బహుమతి సాధించాడు. తిమ్మాపూర్ మండలం మోహమ్మద్ అమన్ ఖాన్ అండర్ 14 బధిరుల విభాగంలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ మండలం ఏలూరి పవన్ సాయి అండర్ 14 మానసిక దివ్యాంగుల విభాగం 50 మీటర్ల పరుగు పందెంలో మూడవ బహుమతి సాధించారు. కలెక్టర్, డీఈవో అభినందన రాష్ట్ర స్థాయి దివ్యాంగ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యా అధికారి అభినందించారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం, సమగ్ర వేదికలు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లిన వారిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, ఐ.ఈ.ఆర్.పి.ఎస్ రాపర్తి గణేష్, శ్రీలత, తిరుపతి, తల్లిదండ్రులు ఉన్నారు.
TELANGANA KARIMNAGAR
రాష్ట్రస్థాయి క్రీడల్లో కరీంనగర్ జిల్లా "భవిత" విద్యార్థుల ప్రతిభ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **