• Other News
  • Live TV
  • ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయం చేసుకోవాలి ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

    Reporter
    admin February 7, 2026, 5:07 pm
    ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయం చేసుకోవాలి ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

    రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -07
    అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
    ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఐడీఓసీలో పీపీటీ ద్వారా శిక్షణ
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సూచించారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ విధులపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై మాట్లాడారు.కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల, వేములవాడలోని సీ నారాయణ రెడ్డి కళామందిరంలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కౌంటింగ్ రోజున ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని సూచించారు. అనంతరం వార్డుల వారీగా ఓట్లు లెక్కించాలని, రౌండ్ల వారీగా పూర్తి అయిన తర్వాత ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న అధికారులకు మినహా ఎవరికీ మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్ళ కూడదని స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకా లను తూచా తప్పకుండా పాటిస్తూ లెక్కింపు జరిగేలా చూడాలని సూచించారు.
    సంబంధిత రిపోర్ట్ లు ఎప్పటి కప్పుడు పంపాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తమకు నిర్దేశించిన విధుల పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసాచారి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow