• Other News
  • Live TV
  • ఎన్న‌కల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న జ‌రుగ‌రాదు, జిల్లా క‌లెక్ట‌ర్ జిజ్వాన్ భాషా షేక్ ......

    Reporter
    admin January 30, 2026, 4:18 pm
    ఎన్న‌కల  ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి  ఉల్లంఘ‌న జ‌రుగ‌రాదు,  జిల్లా క‌లెక్ట‌ర్ జిజ్వాన్ భాషా షేక్ ......

    తేదిః 30.01.2026.
    జ‌న‌గామ జిల్లా.
    ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని తూచ త‌ప్ప‌క పాటించాలి.,
    ఎన్నిక‌ల విధులు స‌మ‌ర్ద‌వంతంగా నిర్వ‌హించాలి,
    ఎన్న‌కల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న జ‌రుగ‌రాదు,
    జిల్లా క‌లెక్ట‌ర్ జిజ్వాన్ భాషా షేక్ ......
    రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిబంద‌న‌ల‌కు లోబ‌డి ర్యాలీల‌కు, వాహ‌నాల‌కు, మైక్‌, ప్ర‌చార సామాగ్రి ముద్రణ అనుమ‌తులలో నిబంద‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాలని, అట్టి న‌క‌ళ్ళ ప్ర‌తుల‌ను భ‌ద్ర‌పర్చుటకు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సంబంధిత అధికారులకు జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో నోడ‌ల్ అధికారులు, జోన‌ల్ అధికారులు, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్లు, ఎన్నిక‌ల నోడల్, జోనల్ అధికారుల‌తో సాధారణ ప‌రిశీల‌కులు న‌ర్సింహ రెడ్డి, అద‌న‌పు క‌లెక్ట‌ర్ (స్దానిక సంస్ధ‌లు) పింకేష్ కుమార్‌ ల‌తో క‌లిసి ఎన్నిక‌ల ఏర్పాట్లు పై కలెక్టర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల విధులు ఎంతో కీల‌క‌మ‌ని, ఎక్కాడా ఏ చిన్న పొర‌పాటుకు తావులేకుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి స‌మ‌ర్ధ‌వంతంగా విధులు నిర్వ‌హించాల‌ని తెలిపారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్తితో పాటు అభ్య‌ర్దులు నామినేష‌న్ల‌ ఉప‌సంహ‌ర‌ణ పూర్తి అయిన పిద‌ప , బ్యాలెట్ పేప‌ర్ల ప్రింటింగ్‌కు, మెటిరీయ‌ల్ పంపిణీ కి చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ఎన్నిక‌ల విధులు కేటాయించిన సిబ్బందికి పోస్ట‌ల్ బ్యాలెట్ త‌ప్ప‌ని సరిగా అందేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఫ్ట‌యింగ్ స్క్వాడ్‌, యం.సి.సి. బృందాలు మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట ఉల్లంఘ‌న జ‌రుగ‌కుండా నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌ల్లో ఉన్నందున యం.సి.సి. నోడ‌ల్ అధికారి ద‌శ‌ల వారిగా నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని అన్నారు. నిబంద‌న‌లు ఉల్లంఘ‌న‌పై ఏమైన ఫిర్యాదులు చేస్తే త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని అదికారుల‌కు సూచించారు. మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్లు క్రమం తప్పకుండ అధికార‌లు, సిబ్బంది స‌మీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని, పోలింగ్ నిర్వ‌హించే సిబ్బందికి ర్యాండ‌మైజేష‌న్ చేపట్టుటకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పోలింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తిస్దాయిలో త‌ప్ప‌ని స‌రిగా వెబ్ క్యాస్టింగ్ చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త చ‌ర్య‌లు ప‌టిష్టంగా చేప‌ట్టాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు .ఈ సంద‌ర్భంగా సాధార‌ణ అబ్జ‌ర్వ‌ర్ ఎ. న‌ర్సింహ రెడ్డి, మాట్లాడుతూ గ్రామ పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించిన తహాలోనే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా స‌మ‌ర్ధవంతంగా, ప్ర‌శాంత వాతావ‌ర‌ణ‌లో నిర్వ‌హించుట‌కు కృషి చేయాలని , ఎన్నిక‌ల్లో పోటీలో నిచిన అభ్య‌ర్దులు మ‌రియు రాజ‌కీయ ప్ర‌తినిధులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేస్తున్న ఖ‌ర్చుల‌ను ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ప్ర‌కారం న‌మోదు చేసే విదంగా చూడాలన్నారు , అలాగే అభ్య‌ర్దులు రోజువారిగా ఖ‌ర్చు చేస్తున్న వివ‌రాల‌ను నిశితంగా ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. అలాగే ఆర్.ఓ.లు, ఎ.ఆర్‌.ఓ.లు, నోడ‌ల్, జోనల్ అధికారులు, సిబ్బంది క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మీక్ష‌లు నిర్వ‌హించాచి, స‌మ‌న్వ‌యంతో విదులు నిర్వహించాలని తెలిపారు , పోస్ట‌ల్ బ్యాలెట్ ప్రింటింగ్ లో పొర‌పాట్లు దొర్లకుంట చుడాల‌న్నారు. పోలింగ్ మెటిరీయ‌ల్ పంపిణీ, తిరిగి స్వీక‌ర‌ణ వంటి ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీ నిర్వ‌హించాలని ఆయన సూచించారు. ఈ స‌మావేశంలో వ్య‌య‌( ఖ‌ర్చులు) ప‌రిశీల‌కులు ఎస్‌. జ‌య‌శ్రీ, జెడ్పీ సిఈఓ మాధురి షా, జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్పూర్ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్లు మ‌హేశ్వ‌ర్ రెడ్డి, రాధాకృష్ట‌, పిడి హౌసింగ్ కొదండ‌రామ్‌, డిసిఓ మాతృనాయ‌క్‌, ఎల‌క్ష‌న్ ప‌ర్య‌వేక్ష‌కులు, నోడ‌ల్‌. జోన‌ల్‌. ఆర్‌.ఓ.లు, ఎ.ఆర్‌.ఓ.లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, త‌దిత‌రులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow