సిరిసిల్ల, జనవరి - 27
మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఇంచార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని, వాటిలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని మున్సిపల్ కమిషనర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సహాయార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్ఓసీ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.సందర్శనలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు ఉన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **